Top

క‌శ్మీర్లో ఉగ్ర‌వాదుల దాడి.. ముగ్గురు జ‌వాన్లు మృతి

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు పోలీస్ క్యాంపులే ల‌క్ష్యంగా వ‌రుస దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా సోపోర్‌ టౌన్‌లో 179 బెటాలియ‌న్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు, జ‌మ్ముక‌శ్మీర్ పోలీసులు క‌లిసి ఉన్న చెక్‌పోస్ట్‌పై ఉగ్ర‌వాదుల‌కు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఉగ్రవాద దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలో ఉగ్ర‌వాదులు భార‌త పారా మిలిట‌రీ బ‌ల‌గాలే ల‌క్ష్యంగా దాడుల‌కు పాల్ప‌డ‌టం ఇది మూడోసారి.

Next Story

RELATED STORIES