అంతకంతకూ పెరుగుతున్న కేసులు.. ఒకే రోజులో 22 మందికి పాజిటివ్

అంతకంతకూ పెరుగుతున్న కేసులు.. ఒకే రోజులో 22 మందికి పాజిటివ్

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్ని చర్యలు చేపడుతున్నా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 74 ఉంటే నిన్న (శనివారం) ఒక్క రోజే 22 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్క విజయవాడ నగరంలోనే 60కు పైగా పాజిటివ్ కేసులు ఉండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. గత నాలుగు రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అయింది. వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించడం కష్టమవుతుండడంతో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోందని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. సామాజిక దూరం పాటించడం అనే ప్రాధమిక అంశాన్ని అందరూ విస్మరిస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతోంది.

కార్మికనగర్‌కు చెందిన పది మంది వ్యక్తులుకు వైరస్ సోకినట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి సరైన పద్ధతులు పాటించకపోవడంతో కేసుల సంఖ్య పెరిగింది. వీరిలో తొమ్మిది నెలల చిన్నారి కూడా ఉంది. ఇక్కడ ఇంకా మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకే ఆ ఏరియాలో నివసిస్తున్న అందరికీ దాదాపుగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. వారిలో ఎంత మందికి పాజిటివ్ వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని పాజిటివ్ కేసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా జిల్లాల్లోని కొంత మంది వ్యక్తులు కరోనాతో మృతి చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story