నిజమైన హీరోలు అమెరికాలో భారతీయ వైద్యులు.. కోవిడ్‌తో ప్రాణాలు..

నిజమైన హీరోలు అమెరికాలో భారతీయ వైద్యులు..  కోవిడ్‌తో ప్రాణాలు..

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసులతో పాటు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా అక్కడే ఎక్కువ. ఈ నేపథ్యంలో అక్కడ వైద్య సేవలు అందిస్తున్న భారతీయ డాక్టర్లు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. వారిలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరి కొంత మంది కోలుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమెరికాలో కోవిడ్ మరణాలు 40 వేల మందికి పైగా ఉన్నారని అంచనా. ఇక వైరస్ బారిన పడిన వారి సంఖ్య 7.5 లక్షల వరకు ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో వైద్యలు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనా బాధితులకు సేవలందిసున్నారు. ట్రీట్‌మెంట్ ఇస్తున్న సమయంలో వారికి కూడా వైరస్ సోకి మృతి చెందుతున్నారు.

భారత్‌కు చెందిన డాక్టర్ మాద్వి న్యూయార్క్ సిటీలో వైద్యురాలిగా సేవలిందిస్తున్నారు. మార్చి నెలలో కరోనా పేషెంట్‌కు చికిత్స చేస్తూ ఆమె కూడా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడిన వైద్యుల్లో అధిక శాతం భారతీయులు ఉన్నారని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) సెక్రటరీ కొల్లి రవి అంటున్నారు. అయితే కచ్చితంగా ఇంత మంది వైద్యులు కరోనా బారిన పడ్డారని చెప్పడం కష్టం అని ఆయన అన్నారు. కానీ, న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది భారతీయ వైద్యులు ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం పది మంది వైద్యుల పరిస్థితి సీరియస్‌గా ఉందని అన్నారు.

గత వారం ప్రియా ఖన్నా అనే నెఫ్రాలజిస్ట్ కరోనాతో మృతి చెందారని తెలిపారు. ఆమె తండ్రి కూడా డాక్టర్. అతడు కూడా కరోనాతో పోరాడుతూ ఐసీయూలో ఉన్నారని రవి తెలిపారు. న్యూయార్క్‌ సిటీలో కరోనా రోగులకు సేవలందిస్తున్న మరో డాక్టర్.. ఓ కరోనా పేషెంట్ అతడి మీద వాంతి చేసుకోవడంతో ఆయన కూడా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా పోరులో కొందరు మరణిస్తూ, కొందరు కోలుకుంటూ నిరంతరం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమ కుటుంబాలను, ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యం అందిస్తున్నారు. భారతీయ అమెరికన్ వైద్యులు నిజమైన హీరోలు అని ఏఏపీఐ ఉపాధ్యక్షురాలు డాక్టర్ జి.అనుపమ ప్రశంసించారు.

Tags

Read MoreRead Less
Next Story