యెడ్యూరప్ప కొంప ముంచిన కుమారస్వామి ఇంట వివాహం

యెడ్యూరప్ప కొంప ముంచిన కుమారస్వామి ఇంట వివాహం
X

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నిఖిల్ పెళ్లి యెడ్యూరప్ప ప్రభుత్వాన్నీ చిక్కుల్లో పెట్టింది. కరోనా విజృంబిస్తున్న సమయంలో ఆ వివాహానికి అనుమతి ఎలా ఇచ్చారని కర్ణాటక హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే జవాబివ్వాలని కోరింది.

ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి క్రిష్ణప్ప మనవరాలు రేవతితో నిఖిల్ వివాహం జరిగింది. ఈ వివాహంలో ఎవరు లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదని.. మాస్కులు ధరించలేదని సోషల్ మీడియాలో విమర్శలు వెళ్ళువెత్తాయి. దీంతో పెళ్లిపై నివేదిక సమర్పిచాలని ప్రభుత్వం స్థానిక పోలీసులను ఆదేశించింది. అయితే.. ఆ తరువాత ఈ పెళ్లి విషయంలో పెద్దగా మాట్లాడాల్సిన అవసరంలేదని.. నిబంధనలు మేరకే పెళ్లి జరిగిందని సీఎం యెడ్యూరప్ప తెలిపారు. దీనిపై తాజాగా కర్ణాటక హైకోర్టు ఈ మేరకు స్పందించింది.

Next Story

RELATED STORIES