ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 20 మంది పోలీసుల‌కు కరోనా పాజిటివ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 20 మంది పోలీసుల‌కు కరోనా పాజిటివ్
X

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పై పంజా విసిరుతోంది. యూపీలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ లాక్ డౌన్ సమయంలో విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసుల‌కు తాజాగా క‌రోనా సోకింది. కాన్పూర్ సిటీలోని మొర‌దాబాద్ లో 20 మంది పోలీసుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది.

బిజ్నోర్‌, వార‌ణాసి, ఆగ్రా, మొర‌దాబాద్ లో ప‌నిచేస్తున్న 20 మందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో..వారిని ఆయా ప్రాంతాల్లోని హాస్పిటల్ కి త‌ర‌లించినట్లు ఉన్న‌తాధికారులు వెల్లడించారు. పోలీసులకు ఐసోలేష‌న్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. స‌ద‌రు పోలీసులతో స‌న్నిహితంగా ఉన్న వారి వివ‌రాలు కూడా సేక‌రిస్తున్నామ ని పోలీస్ ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు.

Next Story

RELATED STORIES