2 వేల మంది ఖైదీలకు కరోనా

X
TV5 Telugu30 April 2020 5:28 PM GMT
అమెరికాలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. తాజాగా జైళ్లలో ఉన్న 2 వేల మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకిన ఘటన సంచలనం రేపింది. ఇటీవల అమెరికాలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పలు జైళ్లలో ఉన్న సుమారు 2 వేల మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ వెల్లడించింది. మొత్తం 2,700 మందికి పరీక్షలు చేయగా 2,000 మందికి పాజిటివ్ అని తేలింది. అమెరికాలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 60 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ కారణంగా లక్షల మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Next Story