తాజా వార్తలు

తెలంగాణలో కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
X

తెలంగాణలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో గురువారం ఒక్కరోజే కొత్తగా 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,038కి చేరింది. కరోనా వైరస్ కారణంగా గురువారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story

RELATED STORIES