తెలుగు రాష్ట్రాల్లో రెడ్ జోన్ జిల్లాలు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో రెడ్ జోన్ జిల్లాలు ఇవే

కరోనా ప్రభావాన్ని బట్టి దేశవ్యాప్తంగా ఉన్న జిలాల్లను జోన్ల వారీగా విడదీసిన జాబితాలో కేంద్రం మార్పులు చేసింది. కొత్త జోన్లలో కరోనాకు వ్యతిరేకంగా తీసుకోవలసిన చర్యలపై మార్గదర్శకాలను రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ లేఖ ద్వారా తెలియజేశారు.

కొత్తగా ఏర్పాటు చేసిన జాబితాలో దేశ వ్యాప్తంగా 130 జిల్లాలు రెడ్‌జోన్‌లో, 284 జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లో, 319 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నట్లు తెలిపింది. రెడ్‌జోన్‌లో అత్యధికంగా యూపీలోని 19 జిల్లాలు, మహారాష్ట్రలోని 14 జిల్లాలు, తమిళనాడులో 12, ఢిల్లీ 11, బెంగాల్‌లో 10 జిల్లాలను కేంద్రం చేర్చింది.

అటు తెలుగు రాష్ట్రాలను కూడా జోన్ల వారీగా విభజించారు.

ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను రెడ్ జోన్లుగా.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ జిల్లాలు ఆరెంజ్‌ జోన్లుగా.. విజయనగరం గ్రీన్‌జోన్ గా విభజించారు.

తెలంగాణలో హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాలు రెడ్ జోన్లుగా.. నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కుమ్రం భీం అసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట, మంచిర్యాల జిల్లాలు ఆరెంజ్ జోన్లుగా.. పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలు గ్రీన్‌జోన్లుగా విభజించారు.

Tags

Read MoreRead Less
Next Story