తాజా వార్తలు

తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష
X

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి సర్కార్ లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈనేపథ్యంలో కరోనా వైరస్‌ నివారణ, లాక్‌డౌన్‌ సడలింపులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఈటెల రాజేందర్‌, నిరంజన్‌ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం జోన్లవారీగా లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులపై విడుదల చేసిన మార్గదర్శకాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఈనెల 5న కేబినెట్‌ భేటీలో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES