ఢిల్లీలో ఓ ఇంటి వద్ద కాల్పులు జ‌రిపిన‌ కానిస్టేబుల్..

ఢిల్లీలో ఓ ఇంటి వద్ద కాల్పులు జ‌రిపిన‌ కానిస్టేబుల్..
X

ఢిల్లీలో కాల్పుల క‌ల‌క‌లం చోటుచేసుకుంది. మీ‌ట్ న‌గ‌ర్ లోని ఓ ఇంటి వ‌ద్ద కానిస్టేబుల్ కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు వ్య‌క్తులకు బుల్లెట్ గాయాల‌య్యాయి. ఈ ఘటనలో కానిస్టేబుల్ స‌హా మ‌రో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీలంపూర్ పోలీస్ స్టేష‌న్ లో కానిస్టేబుల్ గా ప‌నిచేస్తున్న అతని సోదరుడిపై ఓ వ్య‌క్తి దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్ సోదరుడి తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్.. గ‌న్ తో త‌న సోద‌రుడిపై దాడి చేసిన వ్య‌క్తిపై కాల్పులు జ‌రిపారు. గాయాలైన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాల్పులు జ‌రిపిన కానిస్టేబుల్ స‌హా మ‌రో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

RELATED STORIES