నాకు కొడుకు పుట్టాడోచ్.. పేరు ‘‘ఎక్స్ ఏఈ ఏ-12 మస్క్’’ : ఎలాన్ మస్క్

నాకు కొడుకు పుట్టాడోచ్.. పేరు ‘‘ఎక్స్ ఏఈ ఏ-12 మస్క్’’ : ఎలాన్ మస్క్

టెస్లా సంస్థ యజమాని ఎలాన్ మస్క్ తనకు పుట్టిన కొడుకుకు వింతైన పేరు పెట్టి.. మరోసారి నెటిజన్లకు బుర్ర గిర్రున తిరిగేలా చేసాడు. ముందుగా తనకు కొడుకు పుట్టాడని.. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని.. ఈ విషయాన్ని నేను తెలియ జేయడానికి చాల సంతోష పడుతున్న అని ట్వీట్ చేసాడు. అయితే, వెంటనే అంటని ఫాలోవర్ ఒకరు కొడుకు పేరు ఏంటి అని అడిగాడు. దీనికి ఆయన చెప్పిన సమాధానం నెటిజెన్లను విస్మయానికి గురి చేస్తోంది. తన కుమారుడి పేరు ‘‘ఎక్స్ ఏఈ ఏ-12 మస్క్’’ అని ఆయన బదులిచ్చాడు. దీంతో, నెటిజన్ల బుర్ర గిర్రున తిరిగింది. అయితే, తన కుమారుడి పేరును నాస్చా 12 అని పలకవచ్చని మస్క్ సలహా ఇచ్చారు.

అయితే, నాస్చా అనేది ఒక గ్రీకుకు పదం. దీనికి అర్ధం యోధుడు, రక్షకుడు. ప్రపంచాన్ని జయించి.. విశ్వవిజేతగా పేరు గడించిన అలెగ్జాండర్‌ను కూడా నాస్చాగా అని కొందరు పిలుస్తారు.

తన ట్వీట్లతో ఈ మధ్య ఎలాన్ బాగా వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story