అంతర్జాతీయం

చైనాపై తైవాన్ తీవ్ర వ్యాఖ్యలు

చైనాపై తైవాన్ తీవ్ర వ్యాఖ్యలు
X

తైవాన్ ప్రభుత్వం చైనాపై తీవ్రంగా స్పందించింది. ప్రపంచ వేదికలపై ఒక దేశ ప్రజలకు ప్రాతినిధ్య వహించే నైతిక హక్కు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకే ఉంటుందని తైవాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అలాగే, డబ్లూహెచ్‌లో తైవాన్‌కు ప్రాతినిధ్యం వచ్చే హక్కు చైనాకు లేదని స్పష్టం చేసింది. డబ్లూహెచ్‌లో తైవాన్‌కు చోటు లేకపోవడంతో కరోనా కట్టడిలో చాలా సమస్యలు ఏర్పడ్డాయని తెలిపింది. తైవాన్‌ను చైనా.. తమదేశంలో ఓ భూభాగంగా చూస్తూ.. ప్రపంచ వేదికలపై తైవాన్‌కు చోటు లేకుండా చేస్తుంది. ఈ నెలలో జరగనున్న వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పరిశీలక దేశం హోదాలో హాజరవ్వాలని తైవాన్ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే.. చైనా వారి కోరికను తీరకుండా ఏదో ఒక అడ్డంకి పెడుతుందని నిపుణులు అంటున్నారు.

Next Story

RELATED STORIES