కరోనాను కట్టడి చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్సు

కరోనాను కట్టడి చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్సు
X

కరోనాను కట్టడి చేసెందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీరుకుతుంది. అందులో భాగంగానే కొత్త ఆర్డినన్స్ తెచ్చింది. కరోనా లక్షలున్నా ఉద్దేశపూర్వకంగా దాచేవారికి జైలు శిక్ష విధించే విధంగా కొత్తగా ఆర్డినెన్సు తీసుకొని రానున్నారు. ఏడాది నుంచి మూడేళ్ల వరకూ జైలుశిక్షతో పాటు.. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ జరిమానా కూడా అదనంగా విధిస్తారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినా, ఆసుపత్రుల నుంచి పారిపోయినా ఏడాది నుంచి మూడేళ్ల వరకూ జైలుశిక్ష తప్పదు. కరోనా కట్టడి చేసేందుకు యత్నిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసులపై దాడులకు పాల్పడితే ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకూ జైలు గ్యారంటీ. ఐదు లక్షల వరకూ జరిమానాలు కూడా విధిస్తారు. తాజా ఆర్డినన్స్ ప్రకారం లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవు. ఈ ఆర్డినన్స్‌ను యోగి సారద్యంలోని కేబినెట్ ఆమోదించింది కూడా.

Next Story

RELATED STORIES