సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు భరోసా కల్పిస్తాం: ఆర్థిక మంత్రి

సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు భరోసా కల్పిస్తాం: ఆర్థిక మంత్రి

ఆర్థికంగా కుదేలైన సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు భరోసా కల్పించేలా ఆర్థిక ప్యాకేజీకి రూపకల్పన చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ పరిశ్రమలకు చేయూతనివ్వడానికి 3లక్షల కోట్ల రుణాలు ఇవ్వనునట్టు ఆమె తెలిపార. ఎలాంటి పూచీకత్తు లేకుండా.. రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. 12 నెలల మారిటోరియంతో రుణాలు మంజూరు చేస్తామని.. నాలుగేళ్ల కాలపరిమితిలో రుణాలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈ ప్యాకేజీతో 45 లక్షల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అంతేకాకుండా.. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఈక్విటీ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. అక్టోబర్ వరకూ ఈ రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story