తాజా వార్తలు

ఏపీ ప్రభుత్వం జీవోతో తెలంగాణకు నష్టం జరుగుతోంది: రజత్ కుమార్

ఏపీ ప్రభుత్వం జీవోతో తెలంగాణకు నష్టం జరుగుతోంది: రజత్ కుమార్
X

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల్ని ఆపాలని కృష్ణా రివర్స్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు లేఖ రాశామని.. దీనిపై నేరుగా కలిసి వివరిస్తామన్నారు తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌. ఈ నెల ఐదున ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారాయన. ఆ జీవోలో శ్రీశైలం నుంచి నీటిని తరలించాలని ఉందని తెలిపారు. సంఘమేశ్వర‌ పాయింట్‌ నుంచి 3 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని జీవోలో స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ వల్ల తెలంగాణ తాగునీరు, సాగునీటికి ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ఏపీతో కలిసి మెలిసి ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ట్రిబ్యునల్‌లో కృష్ణా జలాల కేటాయింపుల అంశం పెండింగ్‌లో ఉండగా... కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టడం సరికాదన్నారు రజత్‌కుమార్‌

Next Story

RELATED STORIES