దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం: నిర్మలా సీతారామన్

దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం: నిర్మలా సీతారామన్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో నుంచి వచ్చిన ఆలోచన ఇప్పుడు దేశం అంతా పాటించేలా చూస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు వలస కార్మికులకు రేషన్ కార్డ్ ఉన్నా పని మీద వేరే ఊరు లేదా రాష్ట్రం వెళ్తే అక్కడ రేషన్ తీసుకునే సౌకర్యం లేదు. కానీ ఒకే దేశం-ఒకే కార్డ్ అమల్లోకి వస్తే దేశంలో ఎక్కడ ఉన్నా ఆ కార్డ్ ద్వారా రేషన్ తీసుకునే సౌకర్యం ఉంది. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒకే దేశం-ఒకే కార్డు వివరాలు వెల్లడించారు. రేషన్ కార్డులు కలిగి ఉన్న వారు 2021 మార్చి నుంచి దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా రేషన్ సరుకులు పొందే వీలుందని తెలిపారు. ప్రధానమంత్రి సాంకేతిక ఆధారిత వ్యవస్థ సంస్కరణలో భాగంగా తీసుకొచ్చిన ఈ కొత్త విధానంతో 23 రాష్ట్రాల్లోని 67 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది.

Tags

Read MoreRead Less
Next Story