2వేల కోట్ల రూపాయల బీరు నేల పాలు..

2వేల కోట్ల రూపాయల బీరు నేల పాలు..

కరోనా వైరస్ కట్టడి కోసం దేశాలన్నీ లాక్డౌన్‌లోకి వెళ్లి పోయాయి. పబ్‌లు, పరిశ్రమలూ అన్నీ మూత పడ్డాయి. ఎక్కడి ఉత్పత్తి అక్కడే ఆగి పోయింది. గోడౌన్లలో నిల్వ ఉన్న సరుకు పాడైపోయింది. తాజాగా బ్రిటన్‌లో మార్చి 20 నుంచి లాక్డౌన్ అమల్లో ఉంది. ఇది జులై 4 వరకు కొనసాగుతోంది. ఆరోజు నుంచి పబ్‌లన్నీ మూసి ఉన్నాయి. దాంతో దాదాపు రూ.7కోట్ల పింట్ల బీరు వృధా అవుతోంది. అవి తెరుచుకునే నాటికి బీరు ఎందుకూ పని రాకుండా పోతుందని బ్రిటన్ బీర్ అండ్ పబ్ అసోసియేషన్ తెలిపింది.

అయితే ఈ బీరుని సేంద్రీయ వ్యవసాయంలో ఎరువుల కోసం, జంతువుల దాణా కోసం ఉపయోగించవచ్చని అసోసియేషన్ చీఫ్ ఎమ్మా మార్క్ క్లార్కిన్ తెలిపారు. కరోనా కారంగా దెబ్బతిన్న వ్యవసాయాన్ని ఈ రకంగా ఆదుకునేందుకు బీరు ఉపయోగపడడం సంతోషకరమైన విషయం అయినప్పటికీ. పబ్‌లకు భారీ నష్టం వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రూ.7కోట్ల పింట్ల బీరు విలువ బ్రిటన్‌లో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story