మోదీజీ.. మీకు చాలా థ్యాక్సండీ.. రాహుల్ ఆత్మీయ కరచాలనం

మోదీజీ.. మీకు చాలా థ్యాక్సండీ.. రాహుల్ ఆత్మీయ కరచాలనం

మంచి ఎవరు చేసినా మెచ్చుకోవలసిందే. అదే నిజమైన సంస్కారం. అదే చేశారు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. యూపీఏ హయాంలో ప్రారంభించిన మన్‌రెగా (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) పథకానికి 40 వేల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని అర్థం చేసుకుని దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు చేప్పారు.

ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్బర్ భారత్ ప్యాకేజీలో భాగంగా మంత్రి నిర్మలా సీతారామన్ మన్‌రెగాకు 40వేల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు. దీంతో ఈ మొత్తం నిధులు రూ.61 వేల కోట్లకు చేరుకున్నాయి. వలస కార్మికులకు ఈ తాజా కేటాయింపులు మేలు చేయనున్నాయి. యూపీఏ హయాంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని కొనసాగించారు. పని దినాలను పెంచడంతో పాటు కార్మికులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించారు.

అయితే కాంగ్రెస్.. మోదీ అధికారంలోకి రాగానే తాము ప్రవేశ పెట్టిన పథకాలన్నింటిని రద్దు చేస్తారని భావించింది. కానీ మోదీ పథకాలు రద్దు చేయకపోగా, వాటిని అలాగే కొనసాగిస్తూ టెక్నాలజీ సాయంతో ఎలాంటి అవకతకలు జరగకుండా చూస్తున్నారు. ఇదే విషయాన్ని మోదీ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story