జనసేన కార్యకర్త ఆత్మహత్యాయత్నం

X
TV5 Telugu21 May 2020 11:36 AM GMT
పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన జనసేన కార్యకర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడటం తీవ్రకలకలం రేపింది. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను జనసేన కార్యకర్త ఉన్నమట్ల లోకేష్ వీడియో తీశాడు. ఇందుకుగాను అతనిపై కేసు నమోదైంది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన సతీష్ ఒక సెల్ఫీ వీడియో తీసి, తాను ఆత్మహత్యచేసుకుంటున్నట్లు తెలిపారు. ఆ వీడియో వైరల్ కావడంతో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు లోకేష్ ఉన్న ఆస్పత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తాడెపల్లి రూరల్ సిఐ రవికుమార్ అక్కడికి చేరుకొని లోకేష్ వాంగ్మూలం సేకరించారు.
Next Story