అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు..

అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు..

లాక్డౌన్‌ సంక్షోభంతో ఆర్థికంగా నష్టపోయిన చాలా కంపెనీలు ఉద్యోగులను తీసివేయడమో లేదా వేతనాల్లో కోత వంటివి చేస్తున్నాయి. వాటన్నిటికీ విరుద్ధంగా ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ.. తమ సంస్థలో పని చేసేందుకు 50 వేల మంది సిబ్బంది అవసరం అని ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 50 వేల మందిని నియమించుకోనున్నామని తెలిపింది. అమెజాన్ ఫ్లెక్స్‌లో స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్ ఉద్యోగాల కింద వీరిని తీసుకుంటామని సంస్థ తెలిపింది. భారతదేశం అంతటా అమెజాన్ కేంద్రాలు, డెలివరీ నెట్‌వర్క్‌లో ఈ అవకాశాలు ఉంటాయని ప్రకటించింది. కరోనా సంక్షోమ సమయంలో సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తామని అమెజాన్ కస్టమర్ ఫుల్‌ఫిల్మెంట్ ఆపరేషన్స్, వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా ఒక ప్రకటనలో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story