వ్యాక్సిన్ వచ్చినా.. కరోనా మనతోనే ఉంటుంది: శాస్త్రవేత్తలు

వ్యాక్సిన్ వచ్చినా.. కరోనా మనతోనే ఉంటుంది: శాస్త్రవేత్తలు

కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం పోరాటం చేస్తూనే.. మరోవైపు వ్యాక్సిన్ కనుక్కోనే పనిలో పడింది. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కరోనాతో కొన్ని దశాబ్ధాలు కలిసి జీవనం సాగించాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవశాస్త్రం ప్రకారం.. ఇలాంటి రోగాలను ఎన్‌డమిక్ గా పిలుస్తారని.. హెచ్ఐవీ, మీజిల్స్, చికెన్‌పాక్స్ వంటి వ్యాదులు ఈ జాబితాలోకి వస్తాయని అంటున్నారని అన్నారు. కరోనా జాతికి చెందిన నాలుగు వైరస్ లు ఎన్‌డమిక్ గా మారాయని అన్నారు. ఈ కోవలోకి ఇప్పుడు కోవిడ్ 19 కూడా చేరబోతుందని అన్నారు. ఈ విషయాన్ని గ్రహించి కరోనాతో ఎలా మనుగడ సాధించాలనే దానిపై దృష్టికేంద్రీకరించాలని సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story