ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవ్: కేజ్రీవాల్

ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవ్: కేజ్రీవాల్

లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపో్యాయి. దీంతో ప్రభుత్వాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రానికి పెట్టుకున్న అభ్యర్థన ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఉద్యోగులకు నెలసరి జీతాలు చెల్లించడానికి కూడా తమ దగ్గర డబ్బులేదని .. తక్షణమే ఐదువేల కోట్లు రూపాయలలు కేంద్రం సాయం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అటు, ఇదే అంశంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఢిల్లీ ఆర్థిక పరిస్థితిపై సమీక్షా సమావేశం జరిపామని.. గత రెండు నెలలుగా జీఎస్టీ ద్వారా 500 కోట్లు.. ఇతర వనరుల ద్వారా 1735 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని.. కానీ, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే 3,500 కోట్లు ఖర్చు అవుతోందని లేఖలో వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story