ఎస్‌ఈసీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది: నిమ్మగడ్డ రమేశ్‌కుమార్

X
TV5 Telugu31 May 2020 8:19 PM GMT
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును, ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. ఈమేరకు ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేశారు. శనివారం సర్కార్ ప్రకటించిన అంశాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని రమేశ్‌కుమార్ తన ప్రెస్‌నోట్‌లో అభిప్రాయపడ్డారు. SECగా జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని న్యాయస్థానం తోసిపుచ్చిందని రమేశ్ కుమార్ అన్నారు. ఆ ఆర్డినెన్స్, జీవోలను హైకోర్టు కొట్టివేసిందని స్పష్టంచేశారు. ఎస్‌ఈసీగా ప్రభుత్వం తనను తొలగించలేదని గుర్తుచేశారు. హైకోర్టు తీర్పు అనంతరమే తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైనట్టు చెప్పారాయన. ఎస్‌ఈసీ స్వయం ప్రతిపత్తిని, సమగ్రతను దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు.
Next Story