మాక్కూడా తెలియదు కరోనా అని: చైనా శ్వేత పత్రం విడుదల

మాక్కూడా తెలియదు కరోనా అని: చైనా శ్వేత పత్రం విడుదల

ముందే ఎందుకు చెప్పలేదు అంటారు. కరోనా అని మాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అని డ్రాగన్ సిటీ వాపోతోంది. అమెరికాతో సహా అన్ని దేశాలు తమ మీద విరుచుకుపడడంతో చైనా చిన్నబోతోంది. తాజాగా ఈ విషయంపై శ్వేత పత్రం విడుదల చేసింది. డిసెంబర్ 17న కోవిడ్ లక్షణాలతో ఓ వ్యక్తి వూహాన్ ఆస్పత్రిలో జాయినయ్యాడు. అయితే అది అంతుచిక్కని న్యూమోనియా అనుకున్నాం కానీ, మనిషి నుంచి మనిషికి సోకే కరోనా అని అస్సలు మాకు తెలియదు.

జనవరి 19 నే కరోనా అని నిర్ధారించుకున్నాము. దాంతో వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని చెబుతోంది. ఈ మేరకు ఆదివారం చైనా ఓ శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. డిసెంబరు 27న వైరస్ ని గుర్తించి వెంటనే నిపుణులను రంగంలోకి దించామని వివరించింది. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు నిర్వహించిన నేషనల్ హెల్త్ కమిషన్ ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకుతుందని జనవరి 19న రిపోర్ట్ ఇచ్చిందని అందులో పేర్కొంది. ఇక ఈ వైరస్ గురించిన సమాచారాన్ని దాచలేదని ఎప్పడికప్పుడు డబ్ల్యుహెచ్ ఓ తో పంచుకున్నామని తెలిపింది. సంస్థలోని కొందరు అధికారులు వైరస్ విషయాన్ని తమతో పంచుకోలేదన్న నేపథ్యంలో చైనా శ్వేత పత్రం విడుదల చేసి వివరణ ఇచ్చుకుంది.

చైనా వాదన ప్రకారం.. డిసెంబర్ 27న తొలి కరోనా కేసు నమోదైతే న్యుమోనియా అనుకున్నారు. అదే విషయాన్ని డిసెంబర్ 31న డబ్ల్యుహెచ్ ఓతో పంచుకున్నారు. జనవరి 19న మనిషి నుంచి మనిషికి సోకుతుందనే విషయం గుర్తించారు. జనవరి 24న చైనా కరోనా గురించిన తొలి నివేదిక విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story