నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ సంస్థల నుంచి 1,350 కోట్ల సొత్తు రికవరీ!

నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ  సంస్థల నుంచి 1,350 కోట్ల సొత్తు రికవరీ!

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో తలదాచుకున్న మామ అల్లుళ్ళు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీకి నుంచి సొత్తును రికవరీ చేస్తోంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). అందులో భాగంగా హాంగ్ కాంగ్ లో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీకి చెందిన 1,350 కోట్ల రూపాయల విలువైన 2,300 కిలోల వజ్రాలు, ముత్యాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం తిరిగి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

ముంబైకి చేరుకున్న 108 ఎంటిటీస్ లో 32 నీరవ్ మోదీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు చెందినవి, మిగిలినవి మెహుల్ చోక్సీ సంస్థలకు చెందినవిగా అధికారులు తెలిపారు. వీటిలో పాలిష్ చేసిన వజ్రాలు, ముత్యాలు ,వెండి ఆభరణాలు ఉన్నాయి.. వీటి విలువ 1,350 కోట్ల రూపాయలుగా ఈడీ లెక్క తేల్చింది. ఈ విలువైన వస్తువులను తిరిగి తీసుకురావడానికి హాంకాంగ్‌లోని అధికారులతో ఈడీ అధికారులు చర్చలు జరిపి వీటిని తీసుకువచ్చారు. వీటిని ఇప్పుడు పిఎంఎల్‌ఏ కింద అధికారికంగా స్వాధీనం చేసుకుంటామని

ఈడీ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story