ఇకపై చెక్ బౌన్స్ కేసు నేరం కాదు..

ఇకపై చెక్ బౌన్స్ కేసు నేరం కాదు..

బ్యాంకుల ద్వారా ఆర్థిక వ్యవహారాలు నడపడంలో నమ్మకం కలిగించడం నేటి ఆర్ధిక వ్యవస్థలో చాలా అవసరం. డబ్బు ద్వారానే ఆర్ధిక వ్యవహారాలు నడపడం అన్ని చోట్లా సాధ్యం కాదు. 1988కి ముందు చెక్కు నిరాకరించబడితే అది నేరం కాదు. అయితే ఆ ఏడాదిలోనే ఈ చట్టానికి సవరణలు చేశారు. అవి 1-4-89 నుంచి అమలులోకి వచ్చాయి. వీటి ప్రకారం చెక్కును పొందిన వ్యక్తి సదరు చెక్కు ఇచ్చిన వ్యక్తి పై సివిల్ మరియు క్రిమినల్ కేసులు రెండూ దాఖలు చేయవచ్చు. తాజాగా ప్రభుత్వం వాటిని చిన్న చిన్న నేరాలుగా భావించి శిక్షార్హమైన నేరాల జాబితా నుంచి తొలగించాలని చూస్తోంది.

చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రుణాల చెల్లింపు కేసులు, చిట్ ఫండ్ చట్టం వంటివి ఉన్నాయి. వ్యాపార విధానాలు మరింత సరళతరం చేయాలన్న ఆలోచనే ఇందుకు కారణం. అందులో భాగంగానే సాంకేతిక కారణాలతో చేసే చిన్న చిన్న తప్పులను నేరంగా పరిగణించకూడదని భావిస్తోంది. అయితే దీనిపై ఈ నెల 23లోగా తమ అభిప్రాయాలు తెలపాని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పౌర సంఘాలు, విద్యావేత్తలు, తదితరులను కోరింది.

Tags

Read MoreRead Less
Next Story