ఉద్యోగం లేదని నగ్నంగా నిరసన!!

ఉద్యోగం లేదని నగ్నంగా నిరసన!!

ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాలి అది కాస్త వినూత్నంగా ఉండాలి.. తమకు చేయడానికి ఏమీ లేదు అనే సందేశాన్ని వ్యక్తం చేయడాన్ని తమ ఆహార్యంలో ప్రదర్శించాలనుకున్నారు రష్యన్ రెస్టారెంట్లలో పని చేసే ఉద్యోగులు. లాక్డౌన్ కారణంగా ఆదాయాన్ని కోల్పోయిన వందలాది మంది రెస్టారెంట్ ఉద్యోగులతో పాటు యజమానులు సైతం నగ్నంగా నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మార్చి చివరి వారంలో లాక్డౌన్ ప్రకటించారు. అప్పటి నుంచి అక్కడ లాక్డౌన్ కొనసాగుతోంది. కేసులు అత్యధికంగా నమోదవుతుండడంతో అన్ని వ్యాపార కార్యకలాపాలను రద్దు చేశారు. ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్న రష్యా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలనుకుంటోంది. రెస్టారెంట్లు తెరిచే క్రమంలో నగదు కొరత కలిగిన యజమానులు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించే ముందు ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో రష్యా లాక్డౌన్ విధించి తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది.

Tags

Read MoreRead Less
Next Story