ఒకరికి బదులు మరొకరు డిశ్చార్జి.. అదే కొంపముంచింది

ఒకరికి బదులు మరొకరు డిశ్చార్జి.. అదే కొంపముంచింది
X

కరోనా నెగెటివ్ వచ్చిన వ్యక్తికి బదులు.. మరో వ్యక్తిని ఆస్పత్రి సిబ్బంది డిశ్చార్జి చేశారు. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. అయితే, ఇద్దరు పేర్లు ఒకటే కావడం వలన ఈ తప్పిదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అస్సాంలోని ఓ వ్యక్తి.. గత కొన్ని రోజులుగా కరోనాతో చికిత్సపొందుతూ ఎట్టకేలకు కోలుకున్నాడు. అయితే, అతని పేరుతో ఉన్న మరో వ్యక్తి కరోనా పరీక్షలు చేయించుకొని.. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా నెగిటివ్ వచ్చిన వ్యక్తిని డిశ్చార్జ్ చేయడానికి ఆస్పత్రి సిబ్బంది పిలవగా.. అదే సమయంలో.. కరోనా ఫలితాలు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి స్పందించాడు. దీంతో.. ఇద్దరిదీ ఒకే పేరు కావడంతో ఆస్పత్రి సిబ్బంది ఆయనను డిశ్చార్జ్ చేశారు. అయితే, అప్పటికే వారి తప్పిదాన్ని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది.. ఇంటికి చేరుకున్న వ్యక్తికి ఫోన్ చేశారు. అయితే, అప్పటికే వారి తప్పిదాన్ని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది.. డిశ్చార్జ్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసి.. విషయాన్ని తెలియచేసి ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరికీ ఒకే పేరు ఉంచడమే ఇంత తప్పిదానికి కారణమైందని.. అదే కొంపముంచిందని ఆస్పత్రి సిబ్బంది అనుకున్నారు.

Next Story

RELATED STORIES