రెండ్రోజుల క్రితమే కారు కొన్నారు. అందులో ఇద్దరు చిన్నారులు..

రెండ్రోజుల క్రితమే కారు కొన్నారు. అందులో ఇద్దరు చిన్నారులు..
X

డోర్ లాక్ అయి ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మరణించిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మెరాదాబాద్ లో మంగళవారం చోటు చేసుకుంది. రెండ్రోజుల క్రితమే ఆ కుటుంబం సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు. ఇంటిలోని నలుగురు చిన్నారులు ఆడుకుంటూ కారు లోపలికి వెళ్లారు. ఇంతలో కారు డోర్ లాక్ అయిపోయింది. ఆ విషయం తల్లిదండ్రులు గమనించుకోలేదు. ఎప్పటికో పిల్లలు ఎక్కడికి వెళ్లారని వెతుకుతున్నారు. కారులో చూసేసరికి నలుగురు చిన్నారులు అపస్మార స్థితిలో పడి ఉన్నారు. వెంటనే కారు అద్దాలు పగలగొట్టి హూటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఇద్దరు చిన్నారులు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. చనిపోయిన చిన్నారులిద్దరూ కారు లోపల ఊపిరి ఆడక మరణించారని మొరాదాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు.

Next Story

RELATED STORIES