తాజా వార్తలు

తెలంగాణలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 872 కేసులు

తెలంగాణలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 872 కేసులు
X

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 872 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 పాజిటివ్ కేసులు నమోదు కావడం వైరస్ వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 8,674కు చేరింది. రాష్ట్రంలో ఈ నెలాఖరుకు 10 వేల కేసులు నమోదవుతాయని వైద్యఆరోగ్యశాఖ అంచనా వేయగా.. అంతకంటే ఎక్కువగానే కేసులొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3189 నమూనాలు సేకరించగా 872 మందికి పాజిటివ్‌ వచ్చింది.

గ్రేటర్ పరిధిలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. పదుల నుంచి రోజుకు వందల సంఖ్యకు పాజిటివ్ కేసులు పెరిగాయి. ఒక్క రోజే గ్రేటర్ పరిధిలోని 713 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లోని దాదాపు అన్ని ప్రాంతాలకు వైరస్ విస్తరించింది. ఇక మరణాల సంఖ్య కూడా 217కు చేరడం అధికార వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది. కరోనాతో ఈరోజు ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇక అటు జిల్లాల్లో సైతం ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఒకటి రెండు కేసులు నమోదైన చోట.. ఇప్పుడు ఆ సంఖ్య పదుల్లోకి చేరింది.

Next Story

RELATED STORIES