అమెజాన్‌లో 20వేల తాత్కాలిక ఉద్యోగాలు

అమెజాన్‌లో 20వేల తాత్కాలిక ఉద్యోగాలు

ప్రముఖ ఈ -కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. 20వేల తాత్కాలిక ఉద్యోగాలను ప్రకటించింది. హైదరాబాద్, పుణే, కోయంబత్తూరు, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగఢ్, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నోతో సహా పది నగరాల్లో తమ సంస్థ అనుబంధ కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలను కల్పించనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ తదితర భాషలపై పట్టు ఉండాలి. ఈ ఉద్యోగానికి ఇంటర్ మీడియట్ అర్హతగా నిర్ణయించింది అమెజాన్. ఈ తాత్కాలిక ఉద్యోగులతో రానున్న ఆరు నెలల పాటు కస్టమర్ల అవసరాలు తీర్చడంలో ఇబ్బందులు ఉండవని అమెజాన్ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story