కరోనా కాలంలో బొప్పాయి.. రోజూ తింటే..

కరోనా కాలంలో బొప్పాయి.. రోజూ తింటే..

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలన్నా, ఒకవేళ వచ్చినా తగ్గిపోవాలన్నా శరీరానికి రోగ నిరోధక శక్తి చాలా అవసరం అని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా రోగులకు పండ్లు ఎక్కువగా తినమని వైద్యులు సిఫారసు చేస్తుంటారు. ఈ కరోనా కాలంలో అయితే బొప్పాయి పండుని తీసుకోమని మరీ చెబుతున్నారు. అందుకే మార్కెట్లో బొప్పాయికి మంచి గిరాకీ ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి రోజూ ఓ కప్పు బొప్పాయి గింజలు తీసుకోవాలి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరెందులోనూ ఉండవు.. అందరికీ అందుబాటు ధరలో లభించే బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది.

ఇందులో విటమిన్ ఎ,బి,సిలు తగుమోతాదులో ఉన్నాయి. తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు అందుతాయి. బొప్పాయిలో 9.81 గ్రాముల కార్బొహైడ్రేట్స్, 5.9 గ్రాముల చక్కెర, 1.8 గ్రాముల పీచు పదార్థం, 0.14 గ్రాముల కొవ్వు, 0.61 గ్రా. ప్రొటీన్, 3 శాతం బీటా కెరోటిన్, రెండు శాతం కాల్షియం, ఒక శాతం ఐరన్, ఒక శాతం పాస్పరస్, మూడు శాతం మెగ్నీషియం, 5 శాతం పొటాషియం, 0.1 శాతం సోడియం ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గించి, మలబద్దకాన్ని నివారిస్తుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్పమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాల బారిన పడే అవకాశం తగ్గుతుంది. కరోనా మన దరి చేరకుండా ఉండాలంటే రోజూ ఓ కప్పు బొప్పాయి ముక్కలు తీసుకుంటే మంచిది.

Tags

Read MoreRead Less
Next Story