కూతురి ఫ్రెండ్ అని నమ్మి ఇంట్లోకి రానిస్తే..

కూతురి ఫ్రెండ్ అని నమ్మి ఇంట్లోకి రానిస్తే..

కూతురి స్నేహితురాలేనని ఇంట్లోకి రానిస్తే వంకర బుద్ధిని చూపించింది. స్నేహితురాలి ఇంటి నుంచి రూ. 57 లక్షలు కాజేసిన ఓ యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన చర్ఛనీయాంశమైంది.

ఫుష్ప అనే మహిళ తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫ్లాట్ అమ్మగా వచ్చిన సొమ్మును ఇంట్లో దాచుకుంటే అది కాస్తా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురి స్నేహితురాలైన పూజపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పూజను ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

పుష్ప ఇంట్లోని కంటైనర్‌లో డబ్బులు ఉండటాన్ని కొన్నేళ్ల క్రితం తాను చూశానని పూజ తెలిపింది. అప్పుడు అందులోంచి రూ. 27 లక్షలు దొంగిలించి తన తమ్ముళ్లకు ఇచ్చినట్లు పోలీసుల ముందు నిజం ఒప్పుకుంది. ఆ డబ్బుతో తమ్ముళ్లతో ఫ్లాట్ కొనించింది. అప్పుడు దొంగతనం బయటపడలేదు. దీంతో ఇటీవల పూజ మరోసారి పుష్ప ఇంటికి వెళ్లి.. మళ్లీ రూ.30 లక్షలు కాజేసింది.

ఇంట్లో ఉన్న డబ్బు కనిపించకపోవటంతో పుష్పకి.. పూజపై అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తెచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు పూజ ద్వారానే ఈ మిస్టరీకి తెరదించారు. పూజాతో పాటు అమె సోదరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 29.43 లక్షలతో పాటూ 25 లక్షల విలువైన ఓ ఫ్లాట్‌, నగలను స్వాధీనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story