ప్రతిరోజూ ఈ విధంగా చేస్తే వైరస్ దరి చేరదు.. : పౌష్టికాహార నిపుణులు

ప్రతిరోజూ ఈ విధంగా చేస్తే వైరస్ దరి చేరదు.. : పౌష్టికాహార నిపుణులు

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికే కరోనా వస్తుంది అని ఈ మధ్య తరచూ వింటున్నాము. ఆస్పత్రికి వెళ్తే కూడా దానికి సంబంధించిన మాత్రలు, మందులు ఇస్తున్నారు. మరి కొవిడ్ వచ్చినా రాకపోయినా.. ముందు జాగ్రత్తగా మన వంటింట్లో ఉండే వాటితోనే రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేద్దాం.. కరోనా రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం.. మరవేంటో తెలుసుకుందాం..

ఉదయం లేవగానే నీళ్లలో తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, బెల్లం, పసుపు కలిపి వేడి చేసుకుని వడపోసి తాగాలి. ఒక్కరికైతే రెండు కప్పుల నీళ్లు పోసి పైన చెప్పినవన్నీ వేసి ఒక కప్పు నీళ్లు అయ్యేవరకు మరిగించి వేడిగా తాగాలి. దీనివల్ల గొంతులో గరగర, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అనంతరం ఓ అరగంట వ్యాయామం చేయాలి. ఎండలో చేస్తే మరీ మంచిది. శరీరానికి సూర్యరశ్మి తగిలి డి విటమిన్ వస్తుంది. నడక, యోగా ఏదో ఒకటి చేయొచ్చు.

8 గంటలలోపు అల్పాహారం తీసుకోవాలి. ఇడ్లీలతో పాటు మొలకెత్తిన గింజలు, క్యారెట్ కొంచెంగా తీసుకుంటే సి,ఈ,బి కాంప్లెక్స్ విటమిన్లు అందుతాయి. 10.30కు సీజన్ లో దొరికే పండ్లు తినాలి. జామ, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, నేరేడు వంటివి. మధ్యాహ్నం భోజనంలో ఆకు కూరతో వండిన పప్పు, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, ముల్లంగి, కాలీప్లవర్, క్యాబేజీ తదితర కూరలు తీసుకోవాలి. వీటిల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.

ఇక ప్రొటీన్ కోసం మాంసాహారులైతే.. వారానికి రెండు మూడు సార్లు 150 గ్రాముల చికెన్, 75 గ్రాముల మటన్, 100 గ్రాముల చేపలు తినాలి. అదే శాకాహారులైతే 50 గ్రాముల పనీర్, శనగలు, బొబ్బర్లు, సోయాబీన్స్ తీసుకోవాలి.

సాయింత్రం స్నాక్స్ కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటి ద్వారా ఐరన్ పుష్కలంగా అందుతుంది. రాత్రి 7.30- 8 గంటలలోపు భోజనం పూర్తి చేయాలి. జొన్న, గోధుమ రొట్టెలు తీసుకోవాలి. పడుకునేముందు కప్పు పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే ఊపిరితిత్తులకు మేలు జరుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story