అంగరక్షకుల జీతం అక్షరాలా కోటి పైనే..

అంగరక్షకుల జీతం అక్షరాలా కోటి పైనే..

సెలబ్రెటీలు మరి.. అడుగేస్తే అభిమానుల పలకరింపులు.. వెనుకనుంచో ముందునుంచో ఎట్నుంచి వచ్చి మీదపడతారో.. తమని తాము కాపాడు కోవాలంటే వారిని కట్టడి చేయడానికి అంగరక్షులు ఉండాల్సిందే.. అంగరక్షులంటే అల్లాటప్ప బాడీగార్డులు కాదు.. చేతిలో గన్ను.. మిన్ను విరిగి మీద పడ్డా తన యజమానిని కాపాడుకునే బలాఢ్యుడు అయి ఉండాలి. మరి అలాంటి వాళ్లకి జీతాలూ భారీగానే ఉంటాయి. బాలీవుడ్ బాద్ షాకి, బిగ్ బీకి, సల్లూ భాయ్ కి, అబ్బో ఒకరేమిటి టాప్ హీరో హీరోయిన్లందరికీ కోట్లలో జీతం తీసుకునే బాడీగార్డులు ఉన్నారు.. ఒకసారి ఆ బాడీ గార్డుల జీతాల కథేంటో తెలుసుకుందామా..

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ బయటకు వెళితే బాడీగార్డ్ రవి సింగ్ వెన్నంటే ఉంటాడు. హీరో, నిర్మాత, ఐపీఎల టీమ్ సహ యజమాని అయిన షారూఖ్ కి అభిమానులూ ఎక్కువే. హీరోల్లో అందరికంటే షారూఖ్ అంగరక్షుకుడి జీతమే ఎక్కువ.. ఏడాదికి రూ.2.5 కోట్లు ఇస్తూ టాప్ పొజిషన్ లో ఉన్నాడు షారుఖ్.

సల్మాన్ తీసిన బాడీగార్డ్ చిత్రం సూపర్ డూపర్ హిట్టైంది. ఈ సినిమాను తన బాడీగార్డ్ షెరాకి అంకితమిచ్చాడు సల్లూ భాయ్.. దీన్నిబట్టి అతడు తన అంగరక్షకుడికి ఎంత విలువ ఇస్తాడో అర్థమవుతుంది. 18ఏళ్లుగా తనతోనే ఉన్న షెరాకి జీతం ఏడాదికి రూ.2 కోట్లకు పైనే.

ఇక బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కి బయట అభిమానులే కాదు ఇండస్ట్రీలోని తారలు కూడా ఆయన నటనకు ఫిదా అవుతారు. వాళ్లు కూడా ఆయన చుట్టూ చేరిపోతారు బయట కనిపిస్తే. మరి వారందరినుంచి సురక్షితంగా బయటపడాలంటే సరైన అంగరక్షకుడు కావాల్సిందే. అందుకే ఆయన తన బాడీగార్డు జితేంద్ర షిండేకి రూ.1.5 కోట్లు ఇస్తున్నారు.

మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ అంగరక్షకుడు యువ్‌రాజ్‌ ఘోర్‌పడె జీతం ఏడాదికి రెండు కోట్లు.

హీరోయిన్ దీపికా పదుకొణె తన మొదటి చిత్రం ఓం శాంతి ఓం నుంచే అభిమానులను సంపాదించుకుంది. మరి వారి తాకిడి నుంచి తప్పించుకోవాలంటే బాడీగార్డ్ కంపల్సరీ. ఆమె అంగరక్షకుడు జలాల్ జీతం ఏడాదికి కోటి. ఎంతో నమ్మకంగా పనిచేసే జలాల్ కు దీపిక ప్రతి ఏడాది రాఖీ కడుతుంది.

అక్షయ్ కుమార్ కి అంగరక్షకుడితో పనేముంది.. సినిమాల్లోనే డూప్ లేకుండా ఫైట్స్ చేస్తుంటాడు అని అనుకోవచ్చు. కానీ బాడీగార్డ్ ష్రెయ్‌సెయ్‌ పక్కన ఉండాల్సిందే అక్షయ్ అడుగు బయట పెట్టిన ప్రతిసారి. అక్షయ్ అతడికి ఇచ్చే జీతం ఏడాదికి రూ.1.2 కోట్లు.

Tags

Read MoreRead Less
Next Story