చేతులు శుభ్రపరచడానికి శానిటైజర్ వాడుతున్నారా..

చేతులు శుభ్రపరచడానికి శానిటైజర్ వాడుతున్నారా..

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు చేతులను తరచూ శుభ్రపరుచుకోమంటున్నారు. అందుకోసం శానిటైజర్ ని విరివిగా వాడేస్తున్నారు చాలా మంది. అయితే ఇలా శానిటైజర్ అతిగా వాడితే ప్రమాదమని అంటున్నారు వైద్యులు. అతి శుభ్రత కూడా అనర్థాలకు దారితీస్తుంది. దాన్నే వైద్య పరిభాషలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడి) అని అంటారని తెలిపారు. అలా అదే ధ్యాసలో ఉంటూ చేతులు పదే పదే కడుక్కునే వాళ్లు వెంటనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని అంటున్నారు. అయినా శానిటైజర్ కంటే సబ్బులే మేలని అంటున్నారు. శానిటైజర్ లో ఉండే ఆల్కహాల్ కడుపులోకి చేరి వికారం కలిగిస్తుంది. దీంతో మన శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. ఇంట్లో ఉన్నప్పుడు శానిటైజర్ బదులు సబ్బు ఉపయోగించమంటున్నారు.

వాష్ రూములు అందుబాటులో లేనప్పుడు మాత్రమే శానిటైజర్ వాడాలని సూచిస్తున్నారు. శానిటైజర్ అమితంగా వాడితే చర్మం పొడిబారుతుందని, అందులో ఉండే ఆల్కహాలే ఇందుకు కారణమని అంటున్నారు. రోజంతా రసాయనాలతో పనిచేసేవారు శానిటైజర్ వాడకపోవడమే మంచిదని అంటున్నారు. గాఢత కలిగిన రసాయనాలు, ఎరువులు, క్రిమసంహారక మందులతో పని చేసేవారు శానిటైజర్ కు దూరంగా ఉండాలి. రసాయనాలు, లిక్విడ్ జెల్ కలిస్తే శరీరానికి మరింత హానికరం. శానిటైజర్ ఎక్కువగా ఉపయోగించే శ్రామికుల శరీరంలో క్రిమిసంహారక అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది.

Tags

Read MoreRead Less
Next Story