శాకాహారులకు ప్రొటీన్ అందాలంటే..

శాకాహారులకు ప్రొటీన్ అందాలంటే..

రోగనిరోధక శక్తి పెరగడానికి ప్రొటీన్స్ అవసరం చాలా ఉంది. మాంసాహారులకైతే మాంసం, చేపలు, గుడ్ల ద్వారా ప్రొటీన్ అందుతుంది. మరి శాఖాహారుల పరిస్థితి ఎలా అంటే.. పప్పు దినుసుల్లో 25 శాతం ప్రొటీన్ ఉంటుంది. కాబట్టి శాఖాహారులు ప్రతి రోజు ఆహారంలో పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, దోశ వంటివి తీసుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో పప్పు తగిన మోతాదులో తీసుకోవాలి. ఒక పూట ఆకుకూరతో కలిపి పప్పు చేస్తే రెండో పూట కూరగాయలతో కలిపి పప్పు దినుసులను చేర్చాలి. ఈ విధంగా చేస్తే ప్రొటీన్ లోపం ఏర్పడకుండా ఉంటుంది.

చాలా మందికి పప్పు తింటే గ్యాస్ సమస్య వస్తుంది. అలాంటి వారు మొలకెత్తిన గింజలను తీసుకోవచ్చు. రాత్రి పూటే నాన బెట్టి పగలు వండినా గ్యాస్ రాకుండా నిరోధించొచ్చు. ఇక పప్పులో కాస్త నిమ్మరసం చేరిస్తే కూడా గ్యాస్ రాదు. ప్రొటీన్ పప్పులోనే కాకుండా సోయా ఉత్పత్తులు.. సోయా పాలు, సోయా పనీర్ లో కూడా ఉంటుంది. సోయాలో 40 శాతం ప్రొటీన్ వుంటుంది. సోయాను వారంలో రెండు మూడు సార్లు తీసుకుంటే ఫలితం ఉంటుంది. సప్లిమెంట్ల రూపంలో కూడా ప్రొటీన్ దొరుకుంతుంది. వీటిని డాక్టర్ ని సంప్రదించి తగిన మోతాదులో తీసుకోవచ్చు.

శరీరానికి సరిపడా ప్రొటీన్ ఉంటే హార్మోన్స్ సమతుల్యత, కణాల ఉత్పత్తి, హిమోగ్లోబిన్ శాతం, ఎంజైమ్స్ తయారీ, కండరాల పటుత్వం వంటి వాటికి ఉపయోగపడుతుంది. వ్యాధుల బారిన పడితే శరీరాన్ని రిపేర్ చేసుకోవడానికి ప్రొటీన్ సహాయపడుతుంది. కావున ఆహారంలో ప్రొటీన్ లోపం లేకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం.

Tags

Read MoreRead Less
Next Story