తాజా వార్తలు

బాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు కన్నుమూత

బాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు కన్నుమూత
X

బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ఐశ్వర్యరాయ్‌, రణదీప్ హుడా జంటగా నటించిన సరబ్జిత్‌ చిత్రంలో నటించిన రాజన్‌ సెహగల్‌(36) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్‌ సెహగల్ ఆదివారం చండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పలు టీవీ సీరియల్ లలో కూడా నటించారు. క్రైమ్‌ పెట్రోల్‌, తుమ్‌ దేనా సాత్ మేరా, సావధాన్‌ ఇండియా.. వంటి కార్యక్రమాల్లో కూడా కనిపించారు. సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) దివంగత నటుడికి ట్విట్టర్‌లో నివాళి అర్పించింది. కాగా, 2010 నుంచి రాజన్‌ సీఐఎన్‌టీఏఏ సభ్యునిగా ఉన్నారు.

Next Story

RELATED STORIES