వాళ్లకి లేని రూల్స్ మాకు మాత్రం ఎందుకు: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బాలీవుడ్ తారలు

వాళ్లకి లేని రూల్స్ మాకు మాత్రం ఎందుకు: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బాలీవుడ్ తారలు

కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్స్ ప్రారంభించాలంటే కొన్ని నియమాలను అనుసరించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఓ కొత్త నిబంధన తెరపైకి వచ్చింది. 65 ఏళ్లు పైబడిన వ్యక్తిని సెట్‌లోకి అనుమతించ కూడదు అని. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సీనియర్ నటులు ఆమోదించలేకపోతున్నారు. మేము కళాకారులం మాకు వయసుతో పనేముంది. ఊపిరి ఉన్నంత వరకు, నటనపై మక్కువ ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటామని హేమామాలిని, షబనా అజ్మీ, పరేష్ రావల్ అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మమ్మల్ని ప్రశ్నార్థకం చేస్తుంది. నేటికి కొన్ని సినిమాల్లో మేము ప్రధాన పాత్రలు పోషిస్తున్నామని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ హేమామాలిని కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు లేఖ రాశారు.

ఇక ఏదైనా విషయాన్ని సమర్థవంతంగా ప్రశ్నించగల నటి షబానా అజ్మీ కళాకారులను, సాంకేతిక నిపుణులను 65 ఏళ్ల కంటే పైబడినవారిని అనుమతించమంటున్నారు.. మరి రాజకీయ నాయకులకు కూడా ఇది వర్తిస్తుంది కదా.. వారెందుకు ఇంట్లో కూర్చోకుండా బయట తిరుగుతున్నారు అని మాట్లాడారు. సినీ పరిశ్రమకు మాత్రమే ఈ నియమాన్ని ఎందుకు వర్తింపజేస్తున్నారు అని అడుగుతున్నారు. వికాస్ ఖన్నా దర్శకత్వంలో తాను ఓ సినిమా చేస్తున్నానని అది లాక్ డౌన్ కారణంగా మధ్యలో ఆగిపోయిందన్నారు.

మరో సీనియర్ నటుడు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కొవిడ్ వ్యాప్తి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో పెద్ద వాళ్లు త్వరగా కరోనా బారిన పడతారని ప్రభుత్వం తీసుకున్న చర్యలు హర్షించదగినవే కాని.. చిత్రీకరణలో పాల్గొనేటప్పుడు నియమ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని అంటున్నారు. 65 ఏళ్లు పైబడిన వైద్యులు, నర్సులు కూడా తమ వృత్తి బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. వారు మరింత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ నిర్విరామంగా తమ సేవలను అందిస్తున్నారు. వయసు వివక్ష లేకుండా ప్రతి ఒక్కరు వారి వారి పనులు చేసుకోవడానికి అనుమతించాలని కోరుతున్నాము. ఇప్పటికే మా కెరీర్ కి దూరంగా ఉండి చాలా నష్టపోతున్నాము అని పరేష్ రావల్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story