అనుష్క.. ఆయిల్ పుల్లింగ్.. ఆరోగ్యానికి ఓ హెల్త్ టిప్

అనుష్క.. ఆయిల్ పుల్లింగ్.. ఆరోగ్యానికి ఓ హెల్త్ టిప్

సినీ తారలు విరామ సమయాల్లో ఏం చేస్తుంటారు.. వాళ్లేం డైట్ తీస్కుంటారు.. ఆరోగ్య చిట్కాలు ఏం పాటిస్తారు.. తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానులకు ఎంతో ఉంటుంది. బాలీవుడ్ తార అనుష్క శర్మ ఆయుర్వేద అభ్యాసం ఆయిల్ పుల్లింగ్ చేస్తుందట. ప్రాచీన పద్దతులే ఎంతో మంచివని కితాబిస్తోంది ఈ బ్యూటీ. కరోనా వైరస్ నుంచి తప్పించుకోవాలంటే శరీరానికి రోగ నిరోధక శక్తి ఎంతైనా అవసరం. శరీరం నుంచి మలినాలను బయటకు పారద్రోలే ప్రక్రియ ఆయిల్ పుల్లింగ్ అని దాన్ని తాను రోజూ చేస్తానని అంటోంది అనుష్క. దీన్ని రోజూ చేయడం వలన నోరు ఆరోగ్యంగా ఉంటుందని, శరీరాన్ని అలసట నుంచి దూరం చేస్తుందని చెబుతోంది.

ఇది ఓ పురాతన అభ్యాసం. ఇలా చేయడాన్ని కవాలా లేదా గండుషా అని పిలుస్తారు. ప్రతి రోజూ ఖాళీ కడుపుతో రెండు స్పూన్ల ఆయిల్ నోట్లో వేసుకుని 30 సెకన్ల పాటు పుక్కిలించినట్లు చేసి ఉమ్మి వేయాలి అని వివరించింది. ఆయిల్ పుల్లింగ్ చేయడం కోసం స్వచ్ఛమైన కొబ్బరి నూనె, సన్ ప్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, ఆలివ్ నూనె దీంట్లో ఏదో ఒకటి వాడవచ్చని తెలిపింది. ఈ చర్య దంతాల పరిశుభ్రతకే కాక, శరీరంలోని మలినాలను కూడా బయటకు తీస్తుంది.. ఇది మైగ్రేన్, గొంతు వాపులను నివారించడం, నోటి దుర్వాసన, చిగుళ్ల రక్తస్రావం, గొంతు పొడిబారడం, పెదవుల పగుళ్లు, దంతాలు, చిగుళ్లను బలోపేతం చేయడంలో ఆయిల్ పుల్లింగ్ సహాయ పడుతుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story