కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు నోటీసులు

కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు నోటీసులు

రాజస్థాన్ రాజకీయం రోజురోజుకు తారాస్థాయికి చేరుతుంది. కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్.. పార్టీపై తిరుగుబాటు చేయడంతో రాజస్థాన్ రాజకీయాలు యావత్ దేశాన్నే తనవైపు తిప్పుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మొత్తం వ్యవహారం వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షకావత్ ఇందులో కీలక పాత్రపోషించారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నారు. దీనినిపై ప్రశ్నించేందుకు కాంగ్రెస్ షెకావత్ కు నోటీసులు జారీ చేసింది. ఇటీవల దీనికి సంబంధించిన ఆడియో టేపులను కూడా కాంగ్రెస్ విడుదల చేసింది. అయితే, షెకావత్ మాత్రం మొదటి నుంచి ఈ ఆరోపణలకు ఖండించారు. తాను విచారణకు సిద్దంగా ఉన్నానని అన్నారు. తనను ప్రశ్నిస్తారు అంటే.. ఎక్కడికైనా రావడానికి సిద్దమేనని అన్నారు. ఈ ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని కొట్టిపారేశారు. కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story