తాజా వార్తలు

కరోనా సోకి బాలల హక్కుల సంఘం నేత మృతి

కరోనా సోకి బాలల హక్కుల సంఘం నేత మృతి
X

ప్రముఖ బాలల హక్కుల సంఘం నేత పీ అచ్యుతరావు కరోనా బారిన పడి మరణించారు. ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స పొందుతున్న ఆయన మలక్ పేట యశోద ఆస్పత్రిలో బుధవారం తుది శ్వాస విడిచారు. పలువురు ప్రజా సంఘం నేతలు అచ్యుతరావు మృతికి సంతాపం ప్రకటించారు. భార్య అనురాధతో బాలల హక్కుల సంఘాన్ని స్థాపించిన అచ్యుతరావు గతంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.

Next Story

RELATED STORIES