విటమిన్లతో వైరస్ దూరం.. ఆహారంతో కరోనాకు చెక్..

విటమిన్లతో వైరస్ దూరం.. ఆహారంతో కరోనాకు చెక్..

కొవిడ్ బారిన పడిన వారికి విటమిన్లు తగు మోతాదులో ఔషధాల రూపంలో అందించి వైద్యం అందిస్తున్నారు. అవసరమైన మేరకు ఔషధాల రూపంలో తీసుకుంటూనే ఆహారంలో కూడా విటమిన్లకు సంబంధించిన పదార్థాలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. వీటిని రోజూ తీసుకోవడం ద్వారా వైరస్ ని ఎదుర్కునే శక్తిని శరీరం కలిగి ఉంటుందని చెబుతున్నారు. వంటిల్లే వైద్య శాల అని పెద్దవాళ్లు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.

ఇప్పుడంటే అన్నింటికీ ఆస్పత్రికి పరిగెట్టాల్సి వస్తుంది కానీ.. ఇది వరకటి రోజుల్లో ఇంట్లో తినే ఆహారం ద్వారానే దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరం వంటి వాటికి ఔషధాలుగా పనిచేసేవి. మిరియాలు, శొంఠి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు.. తదితర సుగంధ ద్రవ్యాలు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియాలుగా ఉపయోగపడతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. వీటితో చేసిన కషాయం కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాని బైటికి పంపిస్తుంది.

ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే త్రిఫల చూర్ణంలో ఉపయోగించే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అన్నీ ఆరోగ్యానికి మంచివే. రోజూ గోరు వెచ్చని నీటిలో ఓ స్పూన్ వేసుకుని తాగితే మలబద్దకం తగ్గుతుంది. శరీరానికి కావలసిన సి విటమిన్ అందుతుంది. జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులు, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో విటమిన్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా ఎ,డి,ఇ,సి, బి12, ప్రొటీన్లు.

విటమిన్ ఎ.. క్యారెట్, బీట్ రూట్, కీర, మామిడి, బొప్పాయి, పాలకూర, బచ్చలి కూర, పాలు , పాల ఉత్పత్తుల్లో అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో యాంటీబాడీస్ ని ఉత్పత్తిచేయడంలో ఎక్కువగా తోడ్పడుతుంది.

విటమిన్ డి.. చేపలు, గుడ్లు, కాలేయం.. ఉదయం వేల సూర్యరశ్ని వీటి ద్వారా లభిస్తుంది.. శరీరంలోని హానికారక క్రిములను దూరం చేస్తుంది.

విటమిన్ ఇ.. పసుపు, సెనగలు, కరివేపాకు, ఎండుకొబ్బరి, బాదం, పిస్తాల్లో లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు దోహదపడుతుంది.

విటమిన్ సి.. అన్ని రకాల ఆకు కూరల్లో లభిస్తుంది. జామ, దానిమ్మ, నిమ్మ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లతో పాటు బొప్పాయి, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్ లలో కూడా ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ బి12.. చేపలు, మాంసం, చికెన్, గుడ్లు, పాలు, పాలఉత్పత్తులు, ఎండుద్రాక్ష వంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తికి, జీర్ణ వ్యవస్త మెరుగుపడడానికి తోడ్పడుతుంది.

ప్రొటీన్లు.. సోయా ఉత్పత్తులు, బీన్స్, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్, మటన్, చేపలు, పాలు, పాలఉత్పత్తులో ఎక్కువగా ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story