వానాకాలంలో వచ్చే వైరస్ లకు దూరంగా ఓ కషాయం..

వానాకాలంలో వచ్చే వైరస్ లకు దూరంగా ఓ కషాయం..

నాలుగు చినుకులు పడితే చాలు.. దగ్గు, జలుబు.. వానాకాలం వస్తూనే వైరస్ లను వెంటేసుకుని వస్తుంది. వాటికి తోడు మహమ్మారి కరోనా మనుషుల్ని చంపుతోంది. వైరస్ ఒంట్లోకి రాకుండా ఉండాలంటే రోజూ ఓ కషాయం చేసుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు. దీంతో పాటు పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి తప్పనిసరిగా చేయాలి. వాటితోపాటు రోగనిరోధక శక్తిని పెంచుకునే కషాయం ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకుని రోజూ తీసుకుంటే సీజనల్ వ్యాధులు దరిచేరవు.

కషాయం తయారీకి కావలసిన పదార్థాలు.. చిన్న అల్లంముక్క, అర చెంచా తేనె, నిమ్మకాయ, గుప్పెడు తులసి ఆకులు, చిన్న దాల్చిన చెక్క, రెండు లవంగాలు, పావు చెంచా సోంపు..

గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు తీసుకుని పైవాటిని (నిమ్మరసం, తేనె వదిలేసి) కచ్చా పచ్చాగా దంచి నీళ్లలో వేయాలి. ఈ నీళ్లలో స్టౌమీద పెట్టి చిన్న మంట మీద ఉంచాలి. నీళ్లు మరిగి ఒక గ్లాసు అయిన తరువాత దించి వడగట్టాలి. అందులో తేనె, నిమ్మరసం కలుపుకుని వేడిగా తాగాలి. రోజుకు రెండు సార్లు ఈ కషాయం తాగితే జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలకు చక్కటి నివారిణిగా పనిచేస్తుంది. ఇందులో ఉపయోగించిన పదార్థాలన్నీ యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఇంకా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కడుపునొప్పి, మలబద్దకం, కడుపులో మంట వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఔషధంలాగ పనిచేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story