రోగనిరోధక శక్తిని పెంచే 'దవాచాయ్'.. 24 రకాల వనమూలికల మిళితం

రోగనిరోధక శక్తిని పెంచే దవాచాయ్.. 24 రకాల వనమూలికల మిళితం

శరీరంలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఏది వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. కరోనా మహమ్మారి లాంటి వైరస్ లు దరి చేరకుండానూ ఉంటాయి. ఆయుర్వేద వైద్యంలో వాడే వనమూలికలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండేలా చూస్తుంది. దాంతో చాలా వ్యాధులకు పరిష్కారం దొరుకుతుంది. కరోనాని సైతం దవాచాయ్ గా పిలవడే ఈ పానీయాన్ని తీసుకుంటే శరీరంలోని పిత్తం శాతాన్ని పెంచి కొవిడ్ ను ఎదుర్కునే శక్తిని అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆయుష్ విభాగం సూచించిన వనమూలికలకు తోడు అదనంగా మరో 20 రకాల మూలికలు కలిపి ఈ దవాచాయ్ ను తయారు చేస్తారు. అశ్వగంధ, శతావరి, నేలవేము, నేలఉసిరి, తిప్పతీగ, పచ్చిపసుపు, శొంఠి, మిరియాలు, లవంగాలు, యాలకులు వంటి 24 రకాల వనమూలికలు ఈ ఆయుర్వేద చాయ్ లో ఉంటాయి. వీటితో ద్రావణాన్ని తయారు చేసి కరోనా బాధితులు, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియాలో పనిచేసే వారికి ఈ దవాచాయ్ ని ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.30 లక్షల విలువైన దవాచాయ్ పొట్లాలను పంపిణీ చేశారు. మరింత మందికి చేరువయ్యేలా ఉచితంగా వీటిని పంపిణీ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story