Top

పెంపుడు పిల్లికి క‌రోనా!

పెంపుడు పిల్లికి క‌రోనా!
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోంది. ఈ మహమ్మారి సామన్యుల సుంచి సెలబ్రెటీల వరకు ఎవరినీ వదలటం లేదు. ఇప్పుడు కరోనా వైరస్ మనుషులతో పాటు పెంపుడు జంతులకు కూడా వ్యాపిస్తోంది. తాజాగా ఓ పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్ వచ్చింది. యజమానుల ద్వారా ఓపెంపుడు పిల్లికి కరోనా సోకినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది.

సర్రేలోని వేబ్రిడ్జ్‌లో ఉన్న యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీ జూలై 22న పిల్లికి కరోనా పరీక్షలు చేసింది. ఇటీవ‌ల ఫ‌లితాలు వెలువ‌డగా ఆ పిల్లికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా, యూకేలో ఒక‌ జంతువుకు కరోనా పాజిటివ్‌ రావడం ఇదే మొదటిసారని ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ వోన్ డాయిల్ తెలిపారు. పిల్లిని పెంచుకుంటున్న ఇంటి యజమానులు గతంలో కరోనా బారిన పడ్డారని, వారి నుంచే పిల్లికి కరోనా సోకి ఉండవచ్చు అంటున్నారు.

Next Story

RELATED STORIES