అంతర్జాతీయం

పాక్‌ కుటిలనీతి : కొత్త రాజకీయ మ్యాప్ ఆమోదం

పాక్‌ కుటిలనీతి : కొత్త రాజకీయ మ్యాప్ ఆమోదం
X

మరోసారి పాకిస్తాన్ తన కుటిల నీతిని ప్రదర్శించింది. భారత్ భూభాగాలను తన రాజకీయ మ్యాపులో చేర్చుకుంది. జమ్మూ కాశ్మీర్ కొన్ని భూభాగాలు , లడఖ్‌లోని ఒక భాగాన్ని కలిగి ఉన్న కొత్త రాజకీయ పటాన్ని పాకిస్తాన్ మంత్రివర్గం ఆమోదించింది. కొత్త రాజకీయ పటంలో ఈ భూభాగాలు పాకిస్తాన్‌కు చెందినవని పేర్కొంది. అంతేకాదు గుజరాత్‌లోని జునాగర్ , మానవాదర్ , సర్ క్రీక్‌ను కూడా ఈ మ్యాప్ లో పాక్ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ లో 370ను భారత్‌ రద్దు చేసి బుధవారంతో ఏడాది అవుతున్న క్రమంలో పాకిస్తాన్‌ ఈ మ్యాప్‌ను విడుదల చేసింది.

Next Story

RELATED STORIES