Top

ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్

ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్
X

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. ఇటీవల కాలంలో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్థారించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గతవారం రోజుల నుంచి తనను కలిసిన వారంగా సెల్స్ ఐసోలేషన్ లోకి వెళ్లాలని తెలిపారు. అదేవిధంగా కరోనా టెస్టులు కూడ చేసుకోవాలని సూచించారు. ప్రణబ్ ముఖర్జీ కరోనా చికిత్స కోసం ఆర్మీ ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తుంది. కాగా.. ఇప్పటికే నలుగురు కేంద్రమంత్రులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. అటు, చాలా రాష్ట్రాల్లో మంత్రులకు కూడా కరోనా సోకింది.

Next Story

RELATED STORIES