అంతర్జాతీయం

అక్కడ 100 రోజులుగా ఒక్క కేసు కూడా లేదు

కరోనా నుండి అత్యంత వేగంగా కోలుకున్న దేశాలలో న్యూజిలాండ్ ఒకటి.. ప్రస్తుతం అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాకుండా పూర్తిగా అదుపులో ఉంది. గత 100 రోజులలో న్యూజిలాండ్‌లో ఒక్క సంక్రమణ కేసు కూడా రాలేదు. దేశంలో 1,569 మందికి వ్యాధి సోకినట్లు అధికారులు గుర్తించారు, వారిలో ఎక్కువ మంది నయమయ్యారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం దేశంలో కేవలం 23 మంది రోగులు మాత్రమే నిర్బంధంలో ఉన్నారు.

అయితే, ప్రపంచంలోని ఇతర దేశాలలో ఈ ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతోందని దేశ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు. అటువంటి పరిస్థితిలో, మేము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా న్యూజిలాండ్ లో కరోనాతో కేవలం 22 మంది మాత్రమే మరణించారు.

Next Story

RELATED STORIES