ఆర్ఎక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతికి కరోనా పాజిటివ్

ఆర్ఎక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతికి కరోనా పాజిటివ్
X

టాలీవుడ్ దర్శకులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతికి ఈ మహమ్మారి సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'నాకు కూడా వచ్చేసింది... త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా' అని ట్వీట్ చేశారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే ఎస్.ఎస్. రాజమౌళి, డైరక్టర్ తేజ కరోనా బారినపడ్డారు. కాగా.. రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. డైరక్టర్ అజయ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన ఆయన.. ప్రస్తుతం మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Next Story

RELATED STORIES